గుడ్ న్యూస్..పేటీఎంకు కొత్త యూపీఐ కస్టమర్లు: ఎన్​పీసీఐ ఆమోదం

గుడ్ న్యూస్..పేటీఎంకు కొత్త యూపీఐ కస్టమర్లు: ఎన్​పీసీఐ ఆమోదం

న్యూఢిల్లీ: కొత్త యూపీఐ వినియోగదారులను చేర్చుకోవడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్​పీసీఐ) పేటీఎంకి అనుమతిని మంజూరు చేసింది. అన్ని విధానపరమైన మార్గదర్శకాలకు,  సర్క్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు కట్టుబడి కొత్త వారిని తీసుకోవాలని స్పష్టం చేసింది. పేటీఎం యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్త యూపీఐ వినియోగదారులను తీసుకోకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్​)పై ఈ ఏడాది ప్రారంభంలో ఆర్​బీఐ ఆంక్షలు విధించింది. 

రూల్స్​ను పాటించనందుకే ఈ నిర్ణయం తీసుకుంది.  ఈ ఏడాది  మార్చిలో  ఎన్​సీపీఐ థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (టీపీఏపీ)గా యూపీఐలో పాల్గొనడానికి పేటీఎంకి అనుమతి ఇచ్చింది. ఎస్​బీఐ, యాక్సిస్​ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, యెస్ బ్యాంకుల ద్వారా యూపీఐ లావాదేవీలను కొనసాగించడానికి ఎన్​పీసీఐకంపెనీని అనుమతించింది. 

ఇదిలా ఉండగా, జొమాటోకు వినోదం, టికెటింగ్ వ్యాపారాన్ని విక్రయించడం ద్వారా అనూహ్యంగా లభించిన లాభం కారణంగా, సెప్టెంబర్ 2024తో ముగిసిన క్వార్టర్​లో వన్​97 కమ్యూనికేషన్స్ రూ. 928.3 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం రూ. 290.5 కోట్ల నష్టం వాటిల్లింది.