హైదరాబాద్, వెలుగు: అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరేంటనిఈబీసీ జాతీయ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి ప్రశ్నించారు. రాజకీయంగా సీఎంలు, మంత్రులను మార్చే క్రమంలో అగ్రవర్ణ పేదలను బలిచేస్తే సహించేది లేదన్నారు.
ఈబీసీ సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సాధించామని గుర్తుచేశారు. కొందరు కుల విద్వేషాలు రెచ్చగొడుతూ అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని, దీన్ని సహించేది లేదని హెచ్చరించారు.
రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసే కుట్రలో భాగంగా అగ్రవర్ణ పేదల కడుపుకొట్టే కుట్ర చేస్తున్నారని, ఎవరైనా ఈబీసీల జోలికొస్తే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు.