
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: పటాన్చెరు పరిధిలోని గీతం డీమ్డ్ యూనివర్శిటీలో బుధవారం' భారతీయ విద్యా నాయకత్వ సమ్మేళనం' పేరిట నేషనల్ ప్రిన్సిపల్స్ మీట్ జరిగింది. దేశంలోని సీబీఎస్ఈ, ఐబీ స్కూల్స్, జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్ హాజరై తమ ఆలోచనలను పంచుకున్నారు. ఈ సందర్భంగా గీతం ప్రెసిడెంట్ శ్రీభరత్ మాట్లాడుతూ లిబరల్ ఎడ్యుకేషన్ వ్యవస్థ, ఆధునిక ఆలోచనలతో నడిచే విద్యా సంస్థలతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
ఏఐ వైపు ప్రతి రంగం పరుగులు పెడుతోందని, దానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో గీతంపరిశోధన, క్వాలిటీ ఎడ్యుకేషన్ లాంటి ప్రగతిశీల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుందని వివరించారు. విద్యా వ్యవస్థలో లిబరల్ ఆర్ట్స్ ప్రోత్సహించేందుకు ఇలాంటి సమ్మేళనాలు దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో ఈఎంఐ సర్వీసెస్ ఇండియా కో ఫౌండర్ లక్ష్మీ అన్నపూర్ణ, గీతం వైస్ ఛాన్స్లర్ డీఎస్. రావు, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.