- కాకర్ల సుబ్బారావు జయంతి కూడా..
- ఆయన పేరిట జీవన సాఫల్య పురస్కారం
- నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్ప
పంజాగుట్ట, వెలుగు : వచ్చే నెల రెండో తేదీన షేక్‌పేటలోని క్రెస్ట్ఆడిటోరియంలో సొసైటీ ఆఫ్ ఇండియన్ రేడియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో రేడియాలజీ జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు. బుధవారం నిమ్స్‌లో సదస్సుకు సంబంధించిన బ్రోచర్ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బీరప్ప మాట్లాడుతూ రేడియాలజీ సదస్సులో నాలుగు వందల మంది సాంకేతిక నిపుణులు, విద్యార్థులు పాల్గొంటారన్నారు. విద్యార్థులు పరిశోధన పత్రాలు సమర్పిస్తారని, అందులో ఉత్తమమైనవి ఎంపిక చేసి నగదు పురస్కారాలు అందజేస్తామన్నారు. అదే రోజు నిమ్స్ వ్యవస్థాపక డైరెక్టర్పద్మశ్రీ డాక్టర్ కాకర్ల సుబ్బారావు శత జయంతిని నిర్వహిస్తామని, రేడియాలజీ విభాగంలో ఉత్తమ సేవలు అందించిన వారికి కాకర్ల సుబ్బారావు జీవన సాఫల్య పురస్కారం ఇస్తామన్నారు.