ఆగస్టు 15న నేషనల్ రిలాక్సేషన్ డే గా జరుపుకుంటారు. కాబట్టి ఇది ఒత్తిడిని తగ్గించడం, విశ్రాంతి తీసుకోవడానికి సమయాన్ని వెచ్చించడంపై దృష్టి పెట్టాల్సిన సమయం. ఈ రోజును ప్రధానంగా యునైటెడ్ స్టేట్స్‌లో జరుపుకుంటారు. అయినప్పటికీ, ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు విశ్రాంతి కోసం ఈ ప్రత్యేకమైన రోజును జరుపుకుంటున్నారు. జీవితంలో రోజూవారి పనులు, కుటుంబ బాధ్యతలతో నిమగ్నమై ఉన్నట్లు భావిస్తున్నా, విశ్రాంతి తీసుకోవడం, అందుకోసం సమయం వెచ్చించడం చాలా ముఖ్యం. కాబట్టి మీరు తక్షణమే విశ్రాంతి తీసుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి సులభమైన మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం.
వాకింగ్ కు వెళ్లండి: ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉత్తమమైన మార్గాలలో ఒకటి వ్యాయామం చేయడం. అందుకోసం బయట తీరికగా షికారు చేయండి. చుట్టూ ఉన్న దృశ్యాలు, శబ్దాలను వినండి. శ్వాసపై దృష్టి కేంద్రీకరించడం, పరిసరాలను ఆస్వాదించడం మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో, ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
సంగీతం వినండి: విశ్రాంతి తీసుకోవడానికి, మనశ్శాంతిగా ఉండడానికి సంగీతం ఒక గొప్ప మార్గం. అందుకు ఓదార్పునిచ్చే వాయిద్య సంగీతం లేదా ఉల్లాసమైన, మనసుకు స్వాంతన కలిగించే ట్యూన్ ఏదైనా సరే వినడం వల్ల ఆ రోజు ప్రశాంతంగా, రిలాక్స్‌గా ఉండగలుగుతారు.
డీప్ బ్రీత్ ను ప్రాక్టీస్ చేయండి: నెమ్మదిగా, గట్టిగా శ్వాసను తీసుకోవడం వలన ఒత్తిడి స్థాయిలను తక్షణమే తగ్గించవచ్చు. కళ్ళు మూసుకుని.. గట్టిగా శ్వాసిస్తూ ఉండండి. శ్వాసపై దృష్టి పెట్టండి. ఇది ఒత్తిడిని వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది.
మసాజ్ ఎక్స్ పీరియన్స్ చేయండి: మసాజ్ అనేది రిలాక్సింగ్ గా ఉండడానికి ఒక అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుంది. ఇది శరీరంలోని ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడటమే కాకుండా, మానసికంగా మరింత రిలాక్స్‌గా ఉండటానికి కూడా సహాయపడుతుంది.
ALSO READ :బొద్దింకల ఫ్రై ఏంట్రా మీ బొంద.. అందులో మళ్లీ టమాటా సాస్..
స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో సమయం గడపండి: ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవడానికి ప్రియమైన వారితో సమయం గడపడం ఉత్తమ మార్గాలలో ఒకటి. వారితో లంచ్ లేదా కాఫీ కోసం బయటకు వెళ్లడం లేదా ఫోన్‌లో చాట్ చేయడం లాంటి మీకు నచ్చిన, మంచి అనుభూతిని కలిగించే వ్యక్తులతో సమయం గడపడం వలన తక్షణమే విశ్రాంతిని పొందవచ్చు, ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవచ్చు.
నేషనల్ రిలాక్సేషన్ డే 2023 సందర్భంగా.. తక్షణమే విశ్రాంతిని, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ ఐదు మార్గాలను సాధన చేయడానికి రోజులో కొంత సమయాన్ని వెచ్చించండి. మీ కోసం కొంత సమయం వెచ్చించడం చాలా అవసరం. ఇది రోజంతా రిలాక్స్‌గా ఉండటానికి సహాయపడుతుంది. కాబట్టి ముందుకు సాగండి.. ఈ రోజు మీ కోసం మీరు కొంత సమయం కేటాయించండి.