
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) 41 సైంటిస్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత : సంబంధిత పోస్టును అనుసరించి తదితర విభాగాల్లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ ఎస్‌ఎస్‌సీ, డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్ ఎంఎస్సీ,ఎంటెక్, ఎంఈ ఉత్తీర్ణత సాధించాలి. జీతం సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సీ', మెడికల్ ఆఫిసర్ 'ఎస్సీ' పోస్టుకు నెలకు రూ. 81,906. నర్స్ 'బీ', లైబ్రరీ అసిస్టెంట్ 'ఏ' పోస్టుకు రూ.65,554 ఉంటుంది. వయసు 18 నుంచి- 35 ఏళ్లు మించరాదు.
ఎంపిక : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.nrsc.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.