గోదావరిఖని, వెలుగు : జాతీయస్థాయిలో మైన్స్ రెస్క్యూ పోటీలను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎసీసీసీఎల్)లో నిర్వహించాలని నిర్ణయించారు. శుక్రవారం హైదరాబాద్‌లో డీఎంఎస్ శ్యామ్ మిశ్రా అధ్యక్షతన జరిగిన మీటింగ్‌లో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ భూషణ్ ప్రసాద్ సింగ్, డైరెక్టర్ ఆపరేషన్ ఎన్.వి.కె. శ్రీనివాస్, తదితర ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూషణ్ ప్రసాద్ సింగ్ మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో రెస్క్యూ పోటీలు నిర్వహించడానికి సింగరేణి సంస్థకు సామర్థ్యం ఉందని తెలిపారు.
నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు రామగుండం 2 డివిజన్‌లో ఉన్న మైన్స్ రెస్క్యూ స్టేషన్ లోనూ, జీడీకే 7 ఎల్ ఈపీ గనిలోనూ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పోటీల్లో కోల్ ఇండియా అనుబంధంగా ఉన్న ఎనిమిది బొగ్గు కంపెనీలు, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌తో పాటు యురేనియం కార్పొరేషన్ ఇండియా, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ తదితర 18 కంపెనీల నుంచి సుమారు 25 జట్లు పాల్గొంటాయని ఆఫీసర్లు తెలిపారు.