రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రక్తదానం.. ఉచిత కంటి వైద్య శిబిరాలను స్థానిక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాసు నేతృత్వంలో యువ సత్తా యూత్ అధ్యక్షులు లక్ష్మణ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ గత ఏడాది హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపిన 800 మంది మరణించారని ఆందోళన వ్యక్తం చేశారు.
హెల్మెట్ పెట్టుకుని వాహనాలు నడపడం శ్రేయస్కరమని అన్నారు. అదేవిధంగా సీట్ బెల్ట్ పెట్టుకోవడం మంచిదన్నారు. పరిమితికి మించి వేగంగా వాహనాలు నడపడం సరికాదు అన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులను హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడపడం ప్రమాదకరమని అన్నారు.
Also Read :- రియల్టర్ పై ఎంపీ ఈటల దాడి
దేశవ్యాప్తంగా 2 లక్షల 80వేల మంది ప్రతి ఏడాది అనేక ప్రమాదాల వారిని చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. MVI వాసు మాట్లాడుతూ.. రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనాలకు సంబంధించి డ్రైవర్లు క్రమం తప్పకుండా నిబంధనలు పాటించాలని సూచించారు.