
- హెడ్డాఫీసును సందర్శించిన జాతీయ కర్మచారి చైర్మన్
- కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్న వెంకటేశన్
హైదరాబాద్, వెలుగు : బల్దియాలో పనిచేసే శానిటేషన్ కార్మికులకు అమలు చేసే పథకాల తీరును జాతీయ సఫాయి కర్మచారి చైర్మన్ వెంకటేశన్ శనివారం సమీక్షించారు. వివిధ విభాగాల్లో శానిటేషన్ వర్కర్స్, సఫాయి కర్మచారి అసోసియేషన్ ప్రతినిధులు చైర్మన్ కు వినతి పత్రాలు అందజేశారు. ముఖ్యంగా శానిటేషన్ వర్కర్స్ కు ప్రభుత్వం అందించే సేవలపై అడిగారు. అనంతరం చైర్మన్ వెంకటేశన్ మాట్లాడుతూ .. శానిటేషన్ వర్కర్ల అటెండెన్స్ టైమ్ పెంచాలని ఆదేశించారు. అరగంట కాకుండా టైమ్ పెంచి వర్కర్లకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు.
ఎస్ఎఫ్ఏలు డబ్బులు ఇవ్వాలని తమను వేధిస్తున్నారని వర్కర్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ జరపాలని బల్దియా కమిషనర్ ను ఆదేశించారు. ఈఎస్ఐ నంబర్ తెలుసా..? అని చైర్మన్ కార్మికులను అడిగగా కొందరు లేదని చెప్పారు. మెడికల్ క్యాంపు ఎన్నిరోజుల కొకసారి ఏర్పాటు చేస్తున్నారనగా... గతేడాది ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూడు నెలల కొకసారి క్యాన్సర్ పై ప్రతి సర్కిల్ లో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ పద్మజ చెప్పారు. అడిషనల్ కమిషనర్లు ఉపేందర్ రెడ్డి, సరోజ, జోనల్ కమిషనర్లు వెంకటేష్ దోత్రె తదితరులు పాల్గొన్నారు.
బల్దియా శానిటేషన్‌పై పోర్ట్ బ్లెయిర్ మున్సిపల్ టీమ్ స్టడీ
శానిటేషన్ బెస్ట్ ప్రాక్టీసెస్ పై స్టడీ చేసేందుకు శనివారం అండమాన్ నికోబార్ పోర్ట్ బ్లెయిర్ మున్సిపల్ టీమ్ శనివారం బల్దియా హెడ్డాఫీసులో కమిషనర్ రోనాల్డ్ రాస్ తో సమావేశవైంది. బల్దియాలో అమలయ్యే కార్యక్రమాలపై అడిగి వివరాలు తెలుసుకుంది. సిటీ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈఎన్ సీ జియాఉద్దీన్, సీఈ దేవానంద్, అడిషనల్ కమిషనర్ సరోజ, డాక్టర్ సునంద, పోర్ట్ బ్లెయిర్ కౌన్సిల్ టీం కో– -ఆర్డినేటర్ కె. గణేశన్, వైస్ చైర్ పర్సన్ బి. పద్మనాభం, కౌన్సిలర్లు పాల్గొన్నారు.