న్యూఢిల్లీ: రష్యా–ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పేందుకు భారత్ముందుకొచ్చింది. ఈ మేరకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ఈ వారం రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ టూర్లో భాగంగా ఆయన బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సదస్సుకు హాజరవుతారు. అలాగే, ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేలా రష్యా అధికారులతో చర్చలు జరుపనున్నట్టు సమాచారం. అదేసమయంలో చైనా ప్రతినిధులతో కూడా మాట్లాడుతారని అధికార వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్‌లో మోదీ పర్యటన తర్వాత రెండున్నర వారాలకే దోవల్రష్యాకు వెళ్లడం విశేషం.
శాంతిస్థాపనకు భారత్ మధ్యవర్తి..!
రష్యా, ఉక్రెయిన్మధ్య శాంతి స్థాపనకు భారత్మధ్యవర్తిత్వం వహిస్తుందని ఇప్పటికే ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టులో ఉక్రెయిన్పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీతో ఆయన చర్చించారు. రష్యా–-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ శాంతివైపు ఉంటుందని స్పష్టం చేశారు. యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా, ఉక్రెయిన్‌లకు పిలుపునిచ్చారు. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మోదీ తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ యుద్ధంలో చైనా, భారత్, బ్రెజిల్ మాత్రమే శాంతి చర్చలకు సాయం చేయగలవని ఇటీవల పుతిన్ కూడా పేర్కొన్నారు.