న్యూఢిల్లీ: వెస్టిండీస్, అమెరికాలో జరిగే టీ20 వరల్డ్ కప్‌కు ఇండియా టీమ్ ఎంపికపై చర్చించేందుకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని నేషనల్ సెలెక్టర్లు మంగళవారం అహ్మదాబాద్‌లో భేటీ కానున్నారు. బీసీసీఐ సెక్రటరీ జై షా ఈ సమావేశంకన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. కొన్ని స్థానాలపై స్పష్టత లేకపోవడంతో జట్టు ప్రకటన ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
రెండో వికెట్‌కీపర్‌తో పాటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్లేస్‌పై మీటింగ్‌లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. సెకండ్ కీపర్ స్లాట్ కోసం ఐపీఎల్‌లో మంచి ఫామ్‌మీదున్న సంజూ శాంసన్(385 రన్స్), కేఎల్ రాహుల్(378) పోటీపడుతున్నారు. మరోవైపు ఆఫ్ స్పిన్ కూడా వేసే హైదరాబాదీ యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ, డెత్‌ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న పంజాబ్ కింగ్స్ పేసర్ సందీప్‌శర్మను కూడా సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకునే చాన్సుంది.