
జేఎన్టీయూ, వెలుగు : ఈ నెల 25, 26 తేదీల్లో కూకట్‌పల్లి జేఎన్టీయూ క్యాంపస్ లో కెమికల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో రెండు రోజులు జాతీయస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ జయశ్రీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సెమినార్‌కు ముఖ్య అతిథిగా వర్సిటీ వీసీ కట్టా నర్సింహారెడ్డి, విశిష్ట అతిథిగా సైంటిస్ట్ శ్రీవారి చంద్రశేఖర్ (మాజీ కార్యదర్శి డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, న్యూఢిల్లీ) హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.
ఐఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు, ప్రముఖ పరిశోధనా సంస్థలు, పరిశ్రమల నుంచి పరిశోధకులు, ప్రొఫెసర్లు, పారిశ్రామిక వేత్తలు పాల్గొంటున్నట్టు వెల్లడించారు. జేఎన్టీయూలోని న్యూ అడ్మిషన్స్ బ్లాక్ నందు జె -హబ్ ఈవెంట్ సెంటర్ లో సెమినార్ జరగనున్నట్లు తెలిపారు.