మహేశ్వరి–అనంత్‌‌ జోడీకి మిక్స్‌‌డ్‌‌ స్కీట్‌‌ గోల్డ్‌‌

మహేశ్వరి–అనంత్‌‌ జోడీకి మిక్స్‌‌డ్‌‌ స్కీట్‌‌ గోల్డ్‌‌

న్యూఢిల్లీ : నేషనల్ షూటింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో మహేశ్వరి చౌహాన్‌‌, అనంత్‌‌జీత్  సింగ్ నరుకా స్కీట్ మిక్స్‌‌డ్‌‌ టీమ్ ఈవెంట్‌‌లో గోల్డ్ మెడల్ గెలిచారు. బుధవారం జరిగిన ఫైనల్లో మహేశ్వరి–అనంత్‌‌ (రాజస్తాన్‌‌) జోడీ 44–43తో మైరాజ్‌‌ అహ్మద్‌‌ ఖాన్‌‌–అరీబా ఖాన్ (యూపీ) జంటపై ఉత్కంఠ విజయం సాధించింది. పంజాబ్‌‌కు చెందిన గనేమన్‌‌ షెకాన్‌‌–అభయ్‌‌ సింగ్‌‌ బ్రాంజ్ మెడల్ గెలిచారు.

జూనియర్‌‌‌‌ మిక్స్‌‌డ్‌‌ స్కీట్‌‌ ఈవెంట్‌‌లో తెలంగాణకు చెందిన బత్తుల మునెక్‌‌–జహ్రా దీశవాలా జోడీ కాంస్యం నెగ్గింది. కాంస్య పతక మ్యాచ్‌‌లో తెలంగాణ జంట 42–36తో రాజస్తాన్‌‌కు చెందిన యదురాజ్‌‌ సింగ్‌‌–యశస్వి రాథోడ్‌‌ను ఓడించింది.