National Sports Day: ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం.. ఎందుకంటే..?

2012 నుంచి భారత జాతీయ క్రీడా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జరుపుకుంటారు. అయితే ఇదే రోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరువుకోవడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. భారత క్రీడలను అత్యున్నత దశకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన దిగ్గజ హాకీ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్‌. అతని పుట్టిన రోజు ఆగస్టు 29. ఆయన జన్మ దినాన్ని పురస్కరించుకొని.. ఆయనకు ఘనమైన నివాళిని ఇస్తూ  ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 

ధ్యాన్ చంద్‌ పుట్టిన రోజున రాష్ట్రపతి భవన్‌లో ప్రతి ఏడాది భారత రాష్ట్రపతి వార్షిక క్రీడా అవార్డులను అందిస్తూ వస్తున్నారు. సంవత్సర కాలంగా క్రీడల్లో ఆటగాళ్లు సాధించిన విజయాలను ఈ రోజు దేశం గుర్తిస్తూ.. అందరికీ సన్మానం చేస్తుంది. 1928, 1932, 1936 ఒలింపిక్ క్రీడల్లో హాకీ విభాగంలో భారత్ గోల్డ్ మెడల్స్ గెలుచుకుంది. ఈ విజయాల్లో ధ్యాన్ చంద్‌ కీలక పాత్ర పోషించాడు. ధ్యాన్ చంద్ గౌరవ నివాళులు అర్పిస్తూ భారతీయ క్రీడలకు ఆయన చేసిన కృషికి.. దేశం అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రీడా పురస్కారం ఖేల్ రత్న అవార్డును  2021లో ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా పేరు మార్చబడింది. 

ALSO READ | Paris 2024 Paralympics : పారిస్‌‌లో పారాలింపిక్స్‌‌ సందడి షురూ

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కేంద్ర యువజన వ్యవహారాల మంత్రి.. క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవియా మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత SAI ధ్యాన్ చంద్ స్టేడియంలో మొక్కలు నాటారు. 2018లో ఖేలో ఇండియా ఉద్యమంతో సహా పలు పథకాలను ప్రారంభించడానికి భారత ప్రభుత్వం జాతీయ క్రీడా దినోత్సవాన్ని వేదికగా ఉపయోగించుకుంది. 

అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ధ్యాన్‌చంద్‌ను ముఖ్యమైన కార్యక్రమాలతో సత్కరిస్తోంది. ప్రభుత్వం ఝాన్సీ 'హీరోస్ గ్రౌండ్'ను అప్‌గ్రేడ్ చేసి ధ్యాన్ చంద్ మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తోంది. మీరట్‌లో రాష్ట్రంలోనే మొట్టమొదటి క్రీడా విశ్వవిద్యాలయం కూడా నిర్మాణంలో ఉంది. దీనికి ఈ హాకీ లెజెండ్ పేరు పెట్టబోతున్నారు.