రాష్ట్రపతిని కలిసిన హుస్సేన్ నాయక్

మహబూబాబాద్ అర్బన్/  గూడూరు, వెలుగు : జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్​నాయక్ శుక్రవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను కలిశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఎస్టీ కమిషన్ నిధులు కేటాయించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.