విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ పెట్టాలి : జాటోతు హుస్సేన్ ​నాయక్

మహబూబాబాద్/ నెల్లికుదురు, వెలుగు : విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ పెట్టాలని జాతీయ ఎస్టీ కమిషన్​సభ్యులు జాటోతు హుస్సేన్​నాయక్​అన్నారు. ఆదివారం ఆయన మహబూబాబాద్​జిల్లా నెల్లికుదురు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఎంపీడీవో బాలరాజ్​తో కలిసి తనిఖీ చేశారు. 

మహబూబాబాద్ పట్టణంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలురు, వసతి గృహాన్ని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు భోజనం, వంట సామగ్రీ, స్టడీ రూమ్స్​ను పరిశీలించి, వసతులపై ఆరా తీశారు. విద్యార్థులతో పలు అంశాలపై మాట్లాడారు.