జూన్ 2024లో జరగాల్సిన జాయింట్ CSIR -UGC -NET పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం ప్రకటించింది. సైన్స్ సబ్జెక్ట్‌లలో జూనియర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లకు CSIR -UGC -NET ఎగ్జామ్ రాస్తారు. అభ్యర్థుల అర్హతను ఈ పరీక్ష నిర్ణయిస్తుంది. జూన్ 25, 27 తేదీల్లో జరగాల్సిన జాయింట్ CSIR NET పరీక్షను కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. తర్వాత ఎగ్జామ్ నిర్వహించే షెడ్యూల్ కోసం అధికారిక వెబ్ సైట్ లో తెలియజేస్తామని అధికారుల పేర్కొన్నారు. గత రెండు రోజుల క్రితమే ఆల్ రెడీ రాసిన యూజీసీ నెట్ ఎగ్జామ్ 2024 రద్దు చేస్తూ ఎన్టీఏ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. UGC -NET ఎగ్జామ్ యూనివర్సిటీలో ప్రొపెసర్ల నియామకానికి, CSIR -UGC -NET సైన్స్ సబ్జెక్ట్‌లలో జూనియర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ చేయడానికి నిర్వహిస్తారు.