నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ), న్యూఢిల్లీ వివిధ విభాగాల్లో 250 డిప్యూటీ మేనేజర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అభ్యర్థులు సెప్టెంబరు 28 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ట వయసు 40 ఏండ్లకు మించరాదు. ఎలక్ట్రికల్, మెకానికల్, సీ అండ్ ఐ, సివిల్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. జీతం ప్రతి నెలకు రూ.70,000 నుంచి 2,00,000 వరకు సంస్థ చెల్లిస్తుంది.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం www.ntpc.co.in వెబ్సైట్లో సంప్రదించాలి.