ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించాలి

ఓటు హక్కు  తప్పనిసరిగా వినియోగించాలి

నెట్​వర్క్, వెలుగు : ఎన్నికల్లో ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలని పలువురు అధికారులు సూచించారు. శనివారం కలెక్టరేట్ తోపాటు ఆయా చోట్ల జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెంలో కలెక్టర్​ జితేశ్ ​వి పాటిల్, ఖమ్మం కలెక్టరేట్​లో స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, ఖమ్మంలో జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు, జిల్లా క్రీడలు, యువజన సంక్షేమ అధికారి సునీల్ రెడ్డి, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ రవికుమార్, ఖమ్మం రూరల్​ మండలం కోదడ క్రాస్ ​రోడ్డులో జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి, రూరల్​ తహసీల్దార్​రాంప్రసాద్, కుసుమంచిలో తహసీల్దారు కరుణశ్రీ, పాల్వచంలో మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఖమ్మం కలెక్టరేట్​లో భారత ఎన్నికల కమిషన్ సీఈవో అందించిన సందేశాన్ని ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించారు. ఆయా మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించారు. మనవహారాలు చేపట్టారు. ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేశారు. ఆయా స్కూళ్లలో నిర్వహించిన మాక్ పోలింగ్ ఆకట్టుకుంది.