సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నేషనల్ వెబ్ నార్

సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నేషనల్ వెబ్ నార్

 సిద్దిపేట, వెలుగు: వాటర్ వరల్డ్ డే, వరల్డ్ పారెస్ట్ డే సందర్భంగా శనివారం సిద్దిపేట  ప్రభుత్వ డిగ్రీ కాలేజీ బాటనీ విభాగం ఆధ్వర్యంలో " పర్యావరణ సుస్థిరత -ఆహార భద్రత" అనే అంశంపై ఒకరోజు నేషనల్ వెబ్​నార్  ఆన్ లైన్  వేదికగా నిర్వహించారు. ఇందులో వివిధ రాష్ట్రాల నుంచి 300 మంది  రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 

వెబ్​​నార్ కన్వీనర్ గా కొమ్మిడి రాణి వ్యవహరించగా ప్రిన్సిపాల్ సునీత అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా శాస్త్రవేత్త సుధాకర్ రెడ్డి  మాట్లాడుతూ.. అంతరించిపోతున్న జీవజాతుల పరిరక్షణ, అడవుల సంరక్షణ ఆవశ్యకత గురించి వివరించారు.