డాక్టర్ ప్రీతి ఘటనపై జాతీయ ఉమెన్స్ రైట్స్ ప్రొటెన్షన్ కమిటీ సీరియస్ అయ్యింది. ప్రీతి ఘటనపై KMC అధికారులు నివేదిక ఇవ్వాలని.. NMC, జాతీయ ఉమెన్స్ రైట్స్ ప్రొటెన్షన్ కమిటీ నోటీసులు అందజేశారు. ఈ మేరకు కాకతీయ మెడికల్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశమైంది. ర్యాగింగ్ నిర్మూలనపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న దానిపై చర్చించారు. అలాగే.. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయాలపై విశ్లేషించి కేంద్ర ప్రభుత్వానికి.. యాంటీ ర్యాగింగ్ కమిటీ నివేదిక సమర్పించనుంది. ఈ విషయాలతో పాటు సైఫ్ పై నమోదైన కేసులు, తీసుకోవాల్సిన చర్యలు, మళ్లీ ర్యాగింగ్ ఘటనలు జరగకుండా చేపట్టనున్న జాగ్రత్తలపై చర్చించారు.
ఇక.. మెడికాల్ కాలేజీల్లో చేరిన తర్వాత చాలామంది మిడిల్ డ్రావ్ అవ్వడం వల్ల యూనివర్సిటీకి మెడికల్ సీట్స్ లాస్ అవుతున్నాయి. అలా లాస్ అవ్వకుండా ఉండేందుకు.. మెడికల్ కాలేజీలో చేరిన తర్వాత పీ.జీ సీటు వదులుకోవాలంటే.. హెల్త్ యూనివర్సిటీ ఒప్పందం ప్రకారం రూ.50లక్షల బాండ్ నిబంధనను అమల్లోకి తీసుకువచ్చారు. దీనిపై ఎవరైనా.. కాలేజీలో చేరిన తర్వాత మధ్యలోనే డ్రాప్ అయితే.. ఆ స్టూడెంట్ హెల్త్ యూనివర్సిటీకి రూ. 50 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.