జాతీయ స్థాయిలో ఓబీసీ ఉద్యమాన్ని విస్తృతం చేస్తాం: జాజుల శ్రీనివాస్ గౌడ్

జాతీయ స్థాయిలో ఓబీసీ ఉద్యమాన్ని విస్తృతం చేస్తాం: జాజుల శ్రీనివాస్ గౌడ్
  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: బీసీ డిమాండ్ల సాధనకు రాజకీయ పార్టీలకతీతంగా జాతీయస్థాయిలో ఓబీసీ ఉద్యమాన్ని విస్తృతం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇందుకు వచ్చే నెల 7న అమృత్​సర్​లో జరగనున్న జాతీయ ఓబీసీ మహాసభ వేదిక కానుందని చెప్పారు. ఈ మహాసభలకు రావాలని ఆదివారం హైదరాబాద్ లో కేంద్రమంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, సురేశ్ శెట్కార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావును కలిసి ఇన్విటేషన్ అందజేశారు. జనగణనలో బీసీ కులగణన, బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు, నిధుల కేటాయింపు, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ డిమాండ్లపై రాజకీయ పార్టీలకతీతంగా అన్ని పార్టీల్లోని ఓబీసీ నేతలను ఏకతాటి పైకి తీసుకొస్తామని జాజుల పేర్కొన్నారు.