ప్రేమ జంట ముద్దు విషయంలో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రేమలో ఉన్న టీనేజర్లు ముద్దు పెట్టుకోవడం నేరంగా పరిగణించలేమని అలా చేసిన యువకుడిపై క్రిమినల్ ప్రోసీడింగ్స్ ను మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఇటీవల రద్దు చేసింది.
జస్టిస్ ఎన్. ఆనంద్, వెంకటేష్ తో కూడిన ధర్మాసనం.. యువతి, యువకుల మధ్య శారీరక సంబంధం ఇద్దరు టీనేజర్ల మధ్య ఏకాభ్రిపాయంతో పరస్పర సహజమైన చర్య అని తీర్పు చెప్పింది. ఈ విషయంలో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 354 ఏ(1)(i) ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోలేమని స్పష్టం చేసింది.
Also Read :- కంటోన్మెంట్ అభివృద్ధికి 303 కోట్ల నిధులు
ఏ కేసులో అంటే..
2020నుంచి రిలేషన్ షిప్ లో ఉన్న యువ జంటకు సంబంధించిన కేసు ఇది. నవంబర్ 2022 న ఫైల్ అయింది. 21యేళ్ల యువకుడు (పిటిషనర్) తన స్నేహితురాలు (ప్రతివాది ) ని ఓ నిర్ధిష్ట ప్రదేశంలో రాత్రి 9గంటల నుంచి అర్థరాత్రి వరకు కలిసి గడిపారు. ఆ సమయంలో యువకుడు అమ్మాయిని అనుమతి లేకుండా ముద్దు పెట్టుకున్నాడని.. ఆమె తల్లిదండ్రులకు చెప్పి పెళ్లి చేసు కోవాలని కోరింది. యువకుడు నిరాకరించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నవంబర్ 4న మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్ ఈ కేసును విచారణకు చేపట్టింది. తీర్పు ఉత్తర్వులో .. అవాంఛనీయమైన, స్పష్టమైన లైంగిక వేధింపులు లేవనిహైకోర్టు స్పష్టం చేసింది.