నేచురల్ గ్యాస్‌ను జీఎస్‌టీ కిందకు తీసుకొస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దీంతో గ్యాస్ ధరలు తగ్గడంతో పాటు, దేశం మొత్తం మీద ఒకే రేటు ఉంటుందని చెప్పారు. ‘నేచురల్ గ్యాస్‌ను జీఎస్‌టీ కిందకు తీసుకురావడానికి ఇండియా కట్టుబడి ఉంది. దేశ ఎనర్జీ సెక్టార్‌లో ఇన్వెస్ట్ చేయండని ప్రపంచాన్ని కోరుతున్నా’ అని మోడీ పేర్కొన్నారు. ఆయిల్, గ్యాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను డెవలప్ చేయడానికి గత ఐదేళ్లలో రూ. 7.5 లక్షల కోట్లను ఖర్చు చేశామని అన్నారు. ఎనర్జీ దిగుమతులు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టామని చెప్పారు. 2030 నాటికి 40 శాతం ఎలక్ట్రిసిటీ రెన్యువబుల్ సోర్స్‌ల నుంచే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో కొన్ని కీలక ఆయిల్ అండ్ గ్యాస్ ప్రాజెక్ట్‌లను వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రామనాథపురం–తూత్తుకుడి నేచురల్ గ్యాస్ పైప్‌లైన్‌ను దేశానికి అంకితం చేశారు.
For More News..