అమెజాన్ ప్రాంతంలో వర్షపుటడవిని సెల్వాలు అని పిలుస్తారు.
ప్రపంచంలో అత్యధికంగా కోకో పండించే దేశం ఘనా.
సెమాంగ్లనే గిరిజనులు మలేషియా ప్రాంతంలో జీవిస్తారు.
కాగితపు గుజ్జు, కాగితం పరిశ్రమ అత్యధికంగా అమెరికాలో అభివృద్ధి చెందింది.
ఈజిప్టులోని వ్యవసాయదారులను ఫల్లాహినులు అని పిలుస్తారు.
సహజ సిద్ధమైన రబ్బరును ఎక్కువగా ఉత్పత్తి, ఎగుమతి చేసే దేశం మలేషియా.
ప్రపంచంలో రాగిని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం చిలీ.
డోల్డ్రమ్ అంటే తక్కువ ఒత్తిడి క్షేత్రం.
స్టెప్పీ ప్రాంతాలను ప్రపంచ రొట్టె గంప అని పిలుస్తారు.
ఇండియా గోధుమలు తక్కువ నాణ్యత కలిగి ఉండటానికి కారణం పరిపక్వపు కాలంలో ఉష్ణోగ్రతలు త్వరగా పెరుగుదల.
అత్యంత లోతైన సరస్సు బైకాల్.
వెర్కోయానస్క్ను ప్రపంచ శీతల ధ్రువంగా పిలుస్తారు.
మంచు తుపానులు అంటార్కిటిక్ ప్రాంత లక్షణం.
గ్రేట్ విక్టోరియా ఎడారి ఆస్ట్రేలియాలో ఉంది.
ఇన్లాండ్ సీగా కాస్పియన్ సముద్రానికి పేరు.
అమెజాన్ బేసిన్ ప్రాంతాన్ని ఎవర్గ్రీన్ ఫారెస్ట్ గా పిలుస్తారు.
దక్షిణ అమెరికాలోని గడ్డి భూములను పంపాలు అని పిలుస్తారు.
ఎడారి మొక్కలు ఆకులకు బదులుగా ఉండటానికి కారణం తేమ అధికంగా ఆవిరైపోవడం నుంచి రక్షించుకోవడానికి.
ప్రపంచంలో కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం బ్రెజిల్.
మంచు ఎడారులకు మరో పేరు టండ్రా.
ప్రపంచంలోనే అధికంగా వజ్రాల గనులు, అత్యంత ఎక్కువగా బంగారం తయారు చేసే దేశం దక్షిణాఫ్రికా.
ఎస్కిమోల జన్మస్థలం గ్రీన్లాండ్.
వెల్డ్ గడ్డి భూములు ఉన్న చోటు దక్షిణ ఆఫ్రికా.
గాధవేర్లు గల చెట్లు భూమధ్యరేఖా ప్రాంతంలో ఉంటాయి.
ఆఫ్రికాలోని విక్టోరియా జలపాతం జాంబెజి నదిపై ఉంది.
ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి సహారా.
కలహారి ఎడారి ఉన్న ప్రాంతం ఆఫ్రికా.
మెర్క్యురీని అత్యధికంగా ఇటలీ తయారు చేస్తోంది.
ఎస్కిమోలు కెనడాలో నివసిస్తున్నారు.
ఒయాసిస్‌లు ఎడారిలో ఏర్పడుతాయి.
డోల్డ్రమ్ అంటే ప్రశాంతం, చిన్న పవనాలతో కూడిన అల్పపీడన వలయం.
సతత హరిత అరణ్యాలను భూమధ్యరేఖా మండలంలో ఉన్నాయి.
నెవడాలో ఉన్న లాస్ వేగస్ ఎడారి పట్టణం కెసినోస్కు ప్రఖ్యాతి గాంచింది.
లావ్స్ అని టాండ్రా ప్రాంతంలో నివసించే ప్రజలనంటారు.
శృంగాకార అడవులును టైగా అని కూడా పిలుస్తారు.
సవన్న పచ్చిక భూములు ఆఫ్రికా ప్రాంతానికి చెందిన ఉష్ణమండల గడ్డిభూములు.
ముళ్లతో కూడిన పొదలు వేడి, పొడి ఎడారి శీతోష్ణస్థితి ప్రాంతంలో కనిపిస్తాయి.
ఉష్ణమండల పచ్చిక మైదానమైన సవన్నాలు తూర్పు ఆఫ్రికాలో ఎక్కువగా ఉంటాయి.
సమశీతోష్ణ ఆకురాల్చు అడవులు పొడికాలంలో ఆకులను రాల్చుతాయి.
ఉష్ణ మండల సతతహరిత అరణ్యాలను ఉష్ణమండల వర్షపుటడవులు అని అంటారు.
పొడి ఎడారుల్లో కనిపించేవి ముళ్లతో కూడిన పొదలు.
బ్రెజిల్‌లోని ఉష్ణమండల సతతహరిత అరణ్యాలను భూమి ఊపరితిత్తులుగా పరిగణిస్తారు.
ప్రపంచంలోని అతిపెద్ద పాముల్లో ఒక్కటైన అనకొండ ఉష్ణమండల వర్షపుటడవుల్లో కనిపిస్తుంది.
ఎబోని, మహాగని, రోజ్‌వుడ్ వృక్షాలు ఉష్ణమండల వర్షపుటడువులు/ ఉష్ణమండల సతతహరిత అరణ్యాల్లో పెరుగుతాయి.
అడవి గేదెలు, దున్నలు, దుప్పిలు సమశీతోష్ణ గడ్డిభూముల్లో సర్వసాధారణంగా కనిపిస్తాయి.
ఉద్భిజ సంపద పెరుగుదల ఉష్ణోగ్రత, తేమపై ఆధారపడి ఉంటుంది.
ఉష్ణమండల ఆకురాల్చు అడవుల్లో కనిపించని జంతువు సిల్వర్ ఫాక్స్.
సహజ ఉద్భిజ సంపదను మొక్క జాతులు మినహా మూడు విశాలమైన కేటగిరీలుగా వర్గీకరించారు.
ఉష్ణ మండల సతతహరితారణ్యంలో అత్యంత సాధారణంగా కనిపించే జంతువు కోతి.
ఉష్ణమండల వర్షపుటడవుల్లో కనిపించే అతిపెద్ద పాము అనకొండ.
రష్యన్ భాషలో టైగా అంటే పరిశుభ్రమన అని అర్థం.
ఉద్భిజ సంపద తరహా, విస్తరణ ఒక ప్రదేశానికి వేరొక ప్రదేశానికి మారడానికి కారణం ఉష్ణోగ్రత, తేమల వ్యత్యాసం.
అర్జెంటీనాలోని సమశీతోష్ణ పచ్చిక భూములను పంపాలు అని పిలుస్తారు.