హాయ్ నాన్న టీజర్ అప్డేట్ వచ్చేసింది..ఎప్పుడంటే ?

 హాయ్ నాన్న టీజర్ అప్డేట్ వచ్చేసింది..ఎప్పుడంటే ?

నేచురల్ స్టార్ నాని(Nani) తను ఎంచుకునే కథల విషయంలో ఎప్పటికప్పుడు ప్రత్యేకత చాటుతూ ఉంటారు. రీసెంట్ గా దసరా లాంటి మాస్ సినిమా తర్వాత..హాయ్ నాన్న( Hi Nanna) అనే ఎమోషనల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు నాని. మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంతో శౌర్యువ్(Shouryuv) దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా  ఈ మూవీని నిర్మిస్తున్నారు. 

లేటెస్ట్ గా హాయ్ నాన్న మూవీ నుంచి టీజర్ అప్డేట్ వచ్చింది. ఈ నెల (అక్టోబర్ 15న) ఉదయం 11 గంటలకు టీజర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటిస్తూ..వీడియో రిలీజ్ చేశారు. నేను నిన్ను నమ్ముతాను..నువ్వు నన్ను నమ్ము. మ్యాజిక్ అవుతుంది. అంటూ హీరో నాని ట్వీట్ చేశారు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. త్వరలో రిలీజ్ అయ్యే టీజర్ తో మరింత హైప్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. తండ్రి కూతుళ్ళ నేపథ్యంతో వస్తున్న ఈ మూవీ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుందని అర్ధం అవుతోంది.

ALSO READ: విడాకులు తీసుకుంటున్న మరో సినిమా జంట

హాయ్ నాన్న మూవీకు టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ హెషం అబ్దుల్ వహాబ్(Hesham Abdul Wahab) సంగీతం అందిస్తున్నాడు. ఇతని  మ్యూజిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇదా..ఇదా..ఇదే తొలిసారిలా..పద..పదా ఏదే కుదిపానుగా..శ్వాసగా అంటూ తన వాయిస్ లో ఆర్ద్రత కనిపిస్తోంది. ఈ మూవీ 2023 డిసెంబర్ 21న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.