![న్యూఇయర్ గిఫ్ట్ గా నాని 30 గ్లిమ్స్](https://static.v6velugu.com/uploads/2023/01/Natural-star-Nani-is-coming-up-with-two-movies-this-year.-Along-with-the-Dussehra-film,-he-is-shooting-another-new-film-Nani-30_LWapxFwl1o.jpg)
నాచురల్ స్టార్ నాని ఈ ఏడాది రెండు సినిమాలతో రాబోతున్నాడు. దసరా సినిమాతో పాటు మరొక కొత్త సినిమా నాని 30ని చిత్రీకరిస్తున్నాడు. నిన్న (జనవరి 1) దీనికి సంబంధించిన గ్లిమ్స్ ని విడుదల చేసి, హ్యాపీ న్యూఇయర్ అని విష్ చేశాడు. ఆ గ్లిమ్స్ ద్వారా ఈ సినిమా తండ్రీ, కూతుళ్ల మధ్య అనుబంధం గురించి ఉండబోతున్నట్లు తెలుస్తుంది. జెర్సీ తర్వాత మరొక ఎమోషనల్ మ్యాజిక్ ఉండనున్నట్లు అర్థం అవుతుంది. గ్లిమ్స్ లో సినిమాకు సంబంధించిన వివరాల్ని కూతురికి వివరిస్తుంటాడు.
అంతేకాకుండా.. సినిమాలో గడ్డం, మీసం ఉండదు. జుట్టు ఒక్కటే ఉండబోతుంది అన్న హింట్ ని కూడా ఇచ్చాడు. నానీకి జోడీగా సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. శౌర్యువ్ డైరెక్ట్ చేస్తున్నాడు. హీషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు. వైరా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. నానీ కూతురిగా బాబే కియారా ఖన్నా నటిస్తుంది.