Darling Pre Release Evet: ఈ పదేళ్లలో నాకు ఇష్టమైన సినిమా అదే..ఆ సినిమా అభిమానిగానే ఇక్కడికి వచ్చా: హీరో నాని

వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా ప్రత్యేక గుర్తింపును అందుకున్న ప్రియదర్శి (Priyadarshi)..జాతిరత్నాలు, మల్లేశం, బలగం లాంటి చిత్రాలతో హీరోగానూ మెప్పించాడు. ఈ క్రమంలో అతను హీరోగా వస్తోన్న లేటెస్ట్ మూవీ డార్లింగ్ (Darling). శుక్రవారం జులై 19న ప్రేక్షకుల ముందుకొస్తోన్న డార్లింగ్ మూవీ వరుస ప్రమోషన్స్ తో బిజీ హైప్ ఎక్కిస్తుంది.

ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన డార్లింగ్‌ ప్రీరిలీజ్ వేడుకకు నేచురల్ స్టార్ నాని (Nani ) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ పదేళ్లలో నా మనసుకి బాగా ఇష్టమైన సినిమా ఏదైనా ఉందంటే అది ప్రియదర్శి నటించిన బలగం మూవీ అన్నారు నాని. 

Also Read:-కల్కి2898AD'..ఈ పేరు చరిత్ర మర్చిపోదు..ప్రసాద్ మల్టీప్లెక్స్లో ప్రభాస్ ప్రభంజనం

డార్లింగ్  ప్రీరిలీజ్ వేడుకలో నాని మాట్లాడుతూ..‘‘వచ్చే వారం నుంచి సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్స్ చేయడానికి రెడీ అవుతున్నాం మా టీమ్ అంతా. కానీ, ప్రియదర్శి డార్లింగ్ మూవీతో అది ముందుగానే షురూ అయిందనే చెప్పాలి. ఇకపోతే డార్లింగ్ సినిమా నుంచి టీజర్, ట్రైలర్ చాలా ఎంటర్ టైనింగ్‌గా ఉన్నాయి. ప్రియదర్శిలాంటి నటుడు ఓ విభిన్నమైన కథని ఎంచుకుని చేస్తున్న చిత్రమిది. ఫ్రెష్ ఫీల్ ఇస్తూ కామెడీ, లవ్ స్టొరీ పై ఆసక్తి  కలిగేలా ఉన్నాయి.ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని నాని కోరారు. 

అలాగే..నాకు ప్రియదర్శిపై చాలా నమ్మకం.తనతో ఎవరైనా సినిమా చేస్తున్నారంటే వాళ్లలో చాలా ప్రతిభ ఉంటుందని నమ్ముతా. అశ్విన్‌ ఈ కథతో ఎంతగా నవ్విస్తాడో ఊహిస్తున్నా.అయితే, ఈ వేడుకకి బలగం హీరో ఫ్యాన్‌గా వచ్చాను. అలాంటి సబ్జెక్టు ఉన్న దర్శి కెరీర్‌లో  డార్లింగ్ కూడా ఒక మైల్ స్టోన్ మూవీ అవ్వాలని కోరుకుంటున్నా అని నాని తెలిపారు.

ఈ పదేళ్ల కాలంలోనే నాకు ఇష్టమైన సినిమా ‘బలగం’. ఆ సినిమా అభిమానిగానే ఈ వేడుకకి వచ్చా. ఈ సినిమా కూడా అంతటి విజయం సాధించి ప్రత్యేకంగా నిలవాలని నాని అన్నారు. నా నిర్మాణ సంస్థలో తదుపరి తెరకెక్కుతున్న మూవీలో దర్శినే హీరో.ఆ సినిమాని జగదీశ్ డైరెక్ట్ చేస్తున్నాడు. మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తాం అంటూ డార్లింగ్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అని నాని చెప్పారు.

ఇక నాని సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన దర్శకుడు వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నారు. డీవీవీ దానన్న నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ బ్యూటీ ప్రియాంక మోహనన్ నటిస్తున్నారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న. ఈ మధ్య విడుదలైన ఈ సినిమా టీజర్,సాంగ్స్  ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. ఆగస్టు 29న విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది చూడాలి.