కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌లో ‘నేచర్‌‌‌‌ ట్రయల్‌‌‌‌’.. ప్రతి శని, ఆదివారాల్లో నిర్వహణకు ఏర్పాట్లు

కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌లో ‘నేచర్‌‌‌‌ ట్రయల్‌‌‌‌’.. ప్రతి శని, ఆదివారాల్లో నిర్వహణకు ఏర్పాట్లు

కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌, వెలుగు : కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌లో అరుదైన పక్షి జాతులను చూడడంతో పాటు అడవి అందాల వీక్షణకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా బర్డ్‌‌‌‌ వాక్‌‌‌‌ నిర్వహించిన అనంతరం సఫారీ వెహికల్‌‌‌‌లో అడవిలో తిప్పేందుకు ‘నేచర్‌‌‌‌ ట్రయల్‌‌‌‌’ ప్రోగ్రామ్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేశారు. పెంచికల్‌‌‌‌ పేట్‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌ రేంజ్‌‌‌‌ పరిధిలో శని, ఆదివారాల్లో బర్డ్‌‌‌‌ వాక్‌‌‌‌ నిర్వహణకు రిజిస్ట్రేషన్‌‌‌‌ మొదలు పెట్టారు. 

బర్డ్‌‌‌‌వాక్‌‌‌‌లో పాల్గొనాలనుకునే వారు రూ. 1500 చెల్లించి రిజిస్ట్రేషన్‌‌‌‌ చేసుకోవాలని ఆఫీసర్లు తెలిపారు. ఈ వాక్‌‌‌‌లో భాగంగా కొండపల్లి అడవిలో అరుదైన వృక్ష శిలాజాలు, నందిగాం పాలరాపు గుట్ట వద్ద పొడుగు ముక్కు రాబందుల స్థావరంతో పాటు అనేక రకాల దేశీయ, విదేశీ వలస పక్షులు సంచారాన్ని చూడొచ్చు. శనివారం అడవికి చేరుకొని రాత్రి అక్కడే బస చేసిన అనంతరం ఆదివారం ఉదయం ఎల్లూరు చెరువు, చుట్టుపక్కల ప్రాంతాల్లో పక్షులను గమనించవచ్చు. 

తర్వాత నేచర్‌‌‌‌ ట్రయల్‌‌‌‌లో భాగంగా సఫారీ వెహికల్‌‌‌‌లో చుట్టు పక్కల ప్రాంతాలను చూపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఈ నేచర్‌‌‌‌ ట్రయల్‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌ ముగుస్తుందని కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ ఎఫ్‌‌‌‌డీవో సుశాంత్‌‌‌‌ సుఖ్‌‌‌‌దేవ్‌‌‌‌ బోబడే తెలిపారు.