ఐటీఐ చదివిన విద్యార్థలకు ఇండియన్ నేవీ నుంచి గుడ్ న్యూస్. నేవల్ డాక్‌యార్డ్ ఇటీవల అప్రెంటీస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 301 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు ఏప్రిల్ 5, 2024లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అప్లికేషన్ ప్రక్రియ ఆన్‌లైన్‌లో ఉంటుంది. అప్రెంటీస్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ముందు అభ్యర్థులకు నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అవ్వాలి. తర్వాత mhrdnats.gov.in అధికారిక వెబ్ సైట్ లో అప్లై చేసుకోవాలి. ఫిట్టర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ వంటి పలు విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
Also Read:ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. అప్లై చేసుకోండి..
అభ్యర్థులు నవంబర్ 21, 2002 మరియు నవంబర్ 21, 2009 మధ్య జన్మించి ఉండాలి. 14 నుంచి 21 మధ్య వయసు గలవారు అర్హులు. ఫిజికల్ మేజర్‌మెంట్స్ 150 సె. మీ ఎత్తు, 45 కిలోల కంటె ఎక్కువ బరువు కలిగి ఉండాలి. చెస్ట్ గాలిపీల్చినప్పుడు 5 సెం.మీ పెరగాలి. అప్లికేషన్ చివరి తేదీ ఎప్రిల్ 5 మాత్రమే.