రూ.800 కోట్ల పెట్టుబడితో మెగాలియో

రూ.800 కోట్ల పెట్టుబడితో మెగాలియో

హైదరాబాద్​, వెలుగు: రియల్ ఎస్టేట్ డెవలపర్ నవనామి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్  విలాసవంతమైన రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ మెగాలియోను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇందుకోసం రూ.800 కోట్లు పెట్టుబడి పెడుతున్నామని, ఫ్లాట్ల ధరలు రూ.ఎనిమిది కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు ఉంటాయని తెలిపింది.  ఈ అపార్టుమెంట్లో రెండు టవర్లు ఉంటాయి.  మొత్తం 50 అంతస్తుల్లో  150 లగ్జరీ అపార్టుమెంట్లు  ఉంటాయి. 

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేవలం 20 నిమిషాల దూరంలో,  ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి 15 నిమిషాల దూరంలో  మెగాలియో ఉంటుందని నవనామి తెలిపింది. 4.1 ఎకరాలలో విస్తరించి ఉన్న మెగాలియో చుట్టూ 1,200 ఎకరాల పచ్చదనం, హిమాయత్ సాగర్ ఉంటుందని సంస్థ ఫౌండర్​ నవీన్ గద్దె చెప్పారు. ఇది రెరా- ఆమోదిత ప్రాజెక్టు అని, ఫ్లాట్లు11,111, 9,999, 8888 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయని వివరించారు.  తాము కస్టమర్లకు 50 రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు.