అమరావతి: విజయవాడ ఇంద్రకీలాద్రిలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. మూడో రోజైన శనివారం అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారు అన్నపూర్ణగా భక్తులను అనుగ్రహించనున్నారు.
ఇదిలా ఉండగా శ్రీశైల మహాక్షేత్రంలో మూడో రోజు భ్రమరాంబికా దేవి చంద్రఘంటాదేవిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. స్వామి అమ్మవార్లకు ఈ రాత్రి రావణ వాహన సేవ జరుగనుంది. దక్షిణ మాఢవీధిలో సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఏర్పాట్లు జరిగాయి.
ALSO READ | తిరుమల బ్రహ్మోత్సవాలు : శ్రీవారికి తొలి నైవేద్యంగా దోసెలు, వడలు..!