నిర్మల్: నిర్మల్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో మొదటిరోజు అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక మండపంలో మహారుద్రాభిషేకం, ప్రత్యేక కుంకుమార్చనలను వేదపండితులు నిర్వహించారు.
బాసర అమ్మవారి దర్శనానికి రాష్ట్రం నుంచే కాక పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భైంసా ఏఎస్పీ అవినాష్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.