![అమ్మా.. నాకు న్యాయం జరిగేలా చూడమ్మా: బాలీవుడ్ నటి జత్వానీ](https://static.v6velugu.com/uploads/2024/10/navaratri-vutsavalu-fourth-day-sri-lalita-tripura-sundari-devi-worship-bollywood-actor-jatwani_HOguL0YF54.jpg)
దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో నాలుగవరోజున అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వీఐపీల తాకిడి ఎక్కువైంది. బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. తన కేసు విషయంలో న్యాయం జరగాలని అమ్మవారిని ప్రార్థించానని తెలిపారు.