Navdeep: శుభలేఖ షేర్ చేసిన హీరో నవదీప్.. ముహూర్తం, డేట్ ఫిక్స్!

Navdeep: శుభలేఖ షేర్ చేసిన హీరో నవదీప్.. ముహూర్తం, డేట్ ఫిక్స్!

టాలీవుడ్ హీరో నవదీప్(Navdeep) షాకిచ్చారు. పెళ్లి గురించి మాట్లాడితేనే ఆమడదూరం పారిపోయే ఈ హీరో.. స్వయంగా శుభలేఖను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఇది చూసి నెటిజన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. అదేంటన్నా.. పెళ్లి గిల్లీ జాన్తా నహి.. అనే నువ్వు కూడా పెళ్లి చేసుకోబోతున్నావా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు.. పెళ్లి ఎప్పుడు? అమ్మాయి ఎవరు? అంటూ ఆరాలు తెస్తున్నారు.

ఇంతకీ నవదీప్ షేర్ చేసిన ఆ శుభలేఖ వెనుక ఉన్న అసలు విషయం ఏంటంటే.. నవదీప్ హీరోగా లవ్ మౌళి(Love Mouli) అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు అవనీద్ర తెరకెక్కిస్తున్న ఈ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో పంఖురి గిద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. చాలా కాలం కృతమే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా పోస్టర్స్ కు, నవదీప్ లుక్స్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఖచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది అని భావించారు. కానీ, సినిమా రిలీజ్ మాత్రం ఆలస్యం అవుతూ వచ్చింది. అలా పాళీ వాయిదాల తరువాత తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఇందుకోసం వినూత్న పద్దతిని ఎంచుకున్నారు. పెళ్లి శుభలేఖ రూపంలో లవ్ మౌళి సినిమా ఏప్రిల్ 19న రిలీజ్ కానుందని ప్రకటించారు.

శుభలేఖలో పెళ్లి కొడుకు పేరు నవదీప్ అని, పెళ్లి కూతురుగా హీరోయిన్ పంఖురి గిద్వానీ పేరు ఉంది. ఇది చూసిన నెటిజన్స్ నిజంగా నవదీప్ పెళ్ళి చేసుకోబోతున్నాడని అనుకున్నారు. కానీ, రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కార్డు అని తెలిసి కంగుతిన్నారు. ప్రస్తుతం నవదీప్ షేర్ చేసిన ఈ శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.