డ్రగ్స్‌ కేసులో ముగిసిన నవదీప్‌ ఈడీ విచారణ

డ్రగ్స్‌ కేసులో ముగిసిన నవదీప్‌ ఈడీ విచారణ

డ్రగ్స్‌ కేసులో హీరో నవదీప్‌ ఈడీ విచారణ ముగిసింది.  సుమారు 8 గంటలపాటు నవదీప్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు.  ఈడీ కార్యాలయానికి ఉదయం 11 గంటల సమయానికి వచ్చిన నవదీప్.. సాయంత్రం 7 గంటలకు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.  మాదాపూర్ డ్రగ్స్ కేసులో విదేశీ పెడ్లర్స్తో ఆర్థిక లావాదేవీలు,  మనీలాండరింగ్ పై నవదీప్ ను ప్రశ్నించారు ఈడీ అధికారులు.  అలాగే ఆయనకు సంబంధించిన 3 బ్యాంక్ ఖాతాలు, నడిపిన పబ్ వివరాలు, నైజీరియన్లతో సంబంధాలపై ఆరా తీశారు.  


ఇంతకీ ఏం జరిగింది


గుడిమల్కాపూర్‌ పరిధిలో కొన్నిరోజులు క్రితం డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఈనెల 10న  విచారణకు హాజరవ్వాలని నటుడు నవదీప్‌కి ఈడీ నోటీసులు జారీ చేసింది. పోలీసులకు చిక్కిన నైజీరియన్‌ డ్రగ్‌ పెడ్లర్‌తో పాటు తెలుగు సినీ నిర్మాత వెంకటరత్నారెడ్డి, రాంచందర్‌లను విచారించడంతో నవదీప్‌ పేరు బయటపడింది. ఈ క్రమంలోనే నవదీప్‌ను కొద్దిరోజుల క్రితం టీన్యాబ్‌ పోలీసులు సుమారు ఆరు గంటలపాటు విచారించారు. తాజాగా ఈడీ అధికారులు ఏకంగా 9 గంటలు  విచారణ చేశారు.