
నటుడు నవదీప్ చాలా గ్యాప్ తరువాత హీరోగా చేసిన సినిమా లవ్ మౌళి. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు అవనీంద్ర తెరకెక్కించాడు. ప్రేమలో సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకున్నాయి. బోల్డ్ సీన్స్, లిప్ లాక్స్ కూడా పుష్కలంగా ఉండటంతో యూత్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేశారు. ఎట్టకేలకు ఈ సినిమా నేడు(జూన్ 7) థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంది? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
మౌళి (నవదీప్) స్వతహాగా పెయింటర్. చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవడంతో తాతయ్య దగ్గర పెరుగుతాడు. మౌళికి 14 ఏళ్ల వయసులో ఆయన చనిపోతాడు. ఇక అక్కడి నుండి తనకు ఇష్టమొచ్చినట్లు బ్రతికేస్తుంటాడు మౌళి. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ ఒకరోజు అనుకోకుండా అడవుల్లో అఘోరాను కలుస్తాడు. ఆయనతో ప్రేమ విషయమై గొడవ పడతాడు. అప్పుడు ఆ అఘోరా మౌళికి ఓ పెయింట్ బ్రష్‌ని సృష్టించి ఇస్తాడు. ఆ బ్రష్ తో మౌళి ఓ అమ్మాయి బొమ్మ గీయగా.. అందులో నుంచి నిజంగానే చిత్ర(పంఖురి గిద్వాని) అనే అమ్మాయి బయటకొస్తుంది. ఆమెతో గొడవ జరిగే సరికి.. మరో బొమ్మ గీస్తాడు. ఈసారి డిఫరెంట్ పర్సనాలిటీతో మళ్లీ వస్తుంది. ఆ తరువాత ఎం జరిగింది? మౌళి ప్రేమ గురించి తెలుసుకున్నాడా? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
లవ్ మౌళి.. ఇదొక నార్మల్ లవ్ స్టోరీ. దానికి ఓ ఫాంటసీ ఎలిమెంట్ ను యాడ్ చేశాడు దర్శకుడు. అందువల్ల ఆడియన్స్ కి కాస్త కొత్త ఫీలింగ్ కలుగుతుంది. ప్రేమ కోసం వెతికే ఒక అబ్బాయి చివరకు ఏం తెలుసుకున్నాడు అనేదే ఈ సినిమా మెయిన్ పాయింట్. సినిమాలో ఫస్ట్ కాస్త లాగ్ అనిపించినా.. సెకండాఫ్ మెప్పిస్తుంది. ప్రేమ గురించి మౌళి తెలుసుకునే సన్నివేశాలు చాలా బాగుంటాయి. ఇక మధ్యలో వచ్చే ముద్దు సీన్స్, బోల్డ్ సన్నివేశాలు సహజంగానే ఉన్నప్పటికీ.. ఒకటి రెండు బోల్డ్ సీన్స్ మాత్రం కాస్త టెంపో పెరిగింది అనిపిస్తుంది. కానీ, కుర్రకారును బాగానే ఆకట్టుకుంటాయి.
నటీనటులు, సాంకేతికనిపుణులు:
ఈ సినిమా గురించి ఒక్కముక్కలో చెప్పాలంటే.. నవదీప్. తన ప్రాణం పెట్టేశారు ఈ హీరో. తన కష్టం ప్రతీసీన్ లో కన్పిస్తుంది. మౌళి పాత్రలో జీవించాడు. ఇక హీరోయిన్ పంఖురి గిద్వాని సూపర్‌గా చేసింది. గ్లామర్ గా కనిపిస్తూనే.. నటనతో మెప్పించింది. ఇక హారికగా భావన సాగి కూడా పర్వాలేదనిపించింది. ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అంటే రానా దగ్గుబాటి అనే చెప్పాలి. అఘోరాగా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి అదరగొట్టేసాడు.
టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమాలో లొకేషన్స్ అదిరిపోయాయి. దర్శకుడే సినిమాటోగ్రాఫర్ కావడంతో ఔట్‌పుట్ నెక్స్ట్ లెవల్లో వచ్చింది. మేఘాలయని అద్భుతంగా చూపించారు. ఇక గోవింద్ వసంత, కృష్ణ అందించిన సంగీతం కూడా సూపర్ గా సెట్ అయ్యింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచింది.
ఇక మొత్తంగా లవ్ మౌళి సినిమా గురించి చెప్పాలంటే.. ప్రేమ కథను కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు.