
టాలీవుడ్ యాక్టర్ నవదీప్(Navdeep)ప్రెజెంట్ ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ లవ్ మౌళి(Love Mouli). దర్శకుడు అవనీంద్ర(Avaneedra) తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
లేటెస్ట్గా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. హీరో తాడు సాయంతో జలపాతం పైకి ఎక్కుతున్న సన్నివేశంతో లవ్ మౌళి ట్రైలర్ మొదలైంది. ‘పట్టపగలు కూడా వెలుతురు పడని ఈ గుహ లాంటి గుండె నాది’..తన ప్లేస్, తన గుండె చూపించే సీన్స్ అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. నవదీప్ వేసే పెయింటింగ్స్..పోరాడే సీన్స్, హీరోయిన్ తో మొదలై లవ్ వార్ ఇంటెన్స్ పెంచుతోంది.
ఆ పెయింటింగ్ అర్ధం ఏంటో తెలుసా..‘ఏం చేస్తున్నామో చూసి ప్రేమిస్తారు..ఎంత సంపాదిస్తాన్నామో చూసి పెళ్లి చేసుకుంటారు.. దీంట్లో లవ్ ఎక్కడుంది’,‘నాకు ఎలాంటి అమ్మాయి కావాలో నాకు తెలియపోవడం ఏంటి?’ అనే డైలాగ్స్ గుండె లోతుల్లోంచి వచ్చినట్టు ఉన్నాయి. నాలుగు నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్‌లో బోల్డ్ కంటెంట్ తో ట్రైలర్ యూత్ లో ఇంపాక్ట్ పెంచుతోంది.
లవ్ మౌళి సినిమా..లాక్ డౌన్ లోనే మొదలై.. రెండేళ్ల తర్వాత వస్తుండటంతో హైప్ అమాంతం పెరిగిపోయింది. అంతేకాకూండా నవదీప్ 2.O గా వస్తోన్న మూవీ కావడంతో ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.