అమ్రోహా ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత

ఉత్తర ప్రదేశ్ లోని అమ్రోహాలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత ఏర్పడింది. ప్రచారానికి వచ్చిన కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారని ఆరోపించారు BSP ఎమ్మెల్యే అభ్యర్థి నవేద్ అయాజ్. దీని వెనక బీజేపీ ఉందని ఆయన ఆరోపించారు. అయితే రాత్రి 8గంటల తర్వాత కూడా ప్రచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందటంతోనే అక్కడికి వెళ్లామని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకునేలోపే తోపులాట జరిగిందన్నారు. MCC ఉల్లంఘన కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు.