ఈ సమయంలో ప్రతి క్షణమూ అమూల్యమైనదే

ఈ సమయంలో ప్రతి క్షణమూ అమూల్యమైనదే
  • ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారిని వేగంగా తీసుకురండి: రాహుల్

ఉక్రెయిన్‌లోని ఖర్కివ్ సిటీపై ఈ రోజు ఉదయం రష్యన్ బలగాలు చేసిన దాడిలో భారత వైద్య విద్యార్థి  మరణించాడు. కర్ణాటకలోని హవేరి జిల్లాకు చలగేరి గ్రామానికి చెందిన నవీన్ శేఖరప్ప.. ఉదయం ఖర్కివ్‌లో ఒక స్టోర్‌‌కు వెళ్లిన సమయంలో బాంబుల దాడి జరగడంతో అతడు తీవ్రంగా గాయపడి ప్రాణాలు వదిలాడు. మెడిసిన్ నాలుగో సంవత్సరం చదువుతున్న నవీన్‌.. మృతిపై పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నవీన్ కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడి కర్ణాటక సీఎం బస్వరాజ్  బొమ్మై ఓదార్చారు. కుటుంబానికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. నవీన్ పార్థివ దేహాన్ని వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. 

ఈ సమయంలో ప్రతీ క్షణమూ అమూల్యమైనది

ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థి నవీన్ మరణించిన విషయం తనను తీవ్రంగా బాధించిందని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. నవీన్ కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఆయన సానుభూతి తెలిపారు. ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ సమయంలో ప్రతీ క్షణమూ చాలా విలువైనదని, భారత ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో మన విద్యార్థులను సురక్షితంగా వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావాలని రాహుల్ సూచించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ స్పందించారు. నవీన్ మృతిపై ఆయన విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులందరినీ స్వదేశానికి తీసుకొచ్చేందుకు అన్ని అన్ని మార్గాలనూ వాడుకోవాలని అన్నారు. 

నోట మాటలు రావడం లేదు

నవీన్ మృతిపై కర్ణాటక బీజేపీ ఎంపీ పీసీ మోహన్ సంతాపం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లో  ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న నవీన్ మృతి వార్త తెలిసి బాధతో తన నోట మాట రాలేదంటూ ట్వీట్ చేశారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కలచివేసిందని అన్నారు. ఈ బాధను తట్టుకునే శక్తిని నవీన్ కుటుంబానికి ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని పీసీ మోహన్ అన్నారు.

మరిన్ని వార్తల కోసం..

ఉదయమే నవీన్‌తో మాట్లాడా.. విలపించిన తండ్రి

గవర్నర్‌ను పిలవకపోవడానికి కారణం ఏంటి ?

ఇండియన్స్ తక్షణమే కీవ్‌ నుంచి బయట పడండి