నిందితులను ఉరితీయాలె.. నవీన్ కుటుంబ సభ్యుల ఆందోళన

తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో మూడవ నిందితురాలిగా ఉన్న నిహారిక రెడ్డికి మార్చి 20 సోమవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇంత త్వరగా నిహారికకు బెయిల్ ఎలా వస్తుందంటూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎల్బీ నగర్ డీసీపీ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. నిందితులను ఉరితీయాలని మృతుడి నవీన్ బంధువులు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డీసీపీ ఆఫీసు ముందు బయటయించారు. 

కనీసం నెల రోజులు కాకుండానే 12 రోజుల్లో బెయిల్ ఎలా వచ్చిందంటూ ఏం సెక్షన్ లో పెట్టారో పోలీసులు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు నవీన్ కుటుంబ సభ్యులు. తమ బిడ్డను క్రూరాతి క్రూరంగా హింసించి చంపేందుకు నిహారిక హరిహర కృష్ణకు పూర్తి సహాయం చేసిందని, హత్య చేయాలనే ఐడియాను నిహారికే చెప్పిందని తెలిపారు. నిందితులను వెంటనే శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.