
నవీన్ చంద్ర హీరోగా పొలిమేర డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘28 డిగ్రీస్ సెల్సియస్’.ఈ మూవీని అనిల్ విశ్వనాథ్ పొలిమేర కంటే ముందే తెరకెక్కించాడు. 2017 లో షూటింగ్ స్టార్ట్ అయ్యి.. 2020 రిలీజ్ చేద్దామని భావించగా.. అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది.
ఫారిన్ షెడ్యూల్స్‌తో క్వాలిటీ పరంగా డీలే అవ్వడం, మధ్యలో లాక్ డౌన్ రావడం వంటి కారణాలతో ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఇటీవలే 2025 ఏప్రిల్ 4న థియేటర్లలో విడుదలైంది. కానీ, ఆడియన్స్ నుంచి మిక్సెడ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది.
28 డిగ్రీ సెల్సియస్ ఓటీటీ:
28 డిగ్రీ సెల్సియస్ మూవీ సడెన్గా ఓటీటీలోకి అడుగుపెట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం తెలుగు భాషలోనే స్ట్రీమింగ్కి అందుబాటులో ఉంది. డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాని ఓ యూనిక్ లవ్ స్టోరీతో సాగే ఎమోషనల్ థ్రిల్లర్గా తెరకెక్కించాడు.
►ALSO READ | HIT 3 Business: చుక్కలు చూపిస్తున్న హిట్ 3 బిజినెస్ లెక్కలు.. బ్రేక్ ఈవెన్ టార్గెట్, ఓటీటీ డీల్ ఎంతంటే?
సినిమా రిలీజ్కు ముందు ప్రమోషన్స్ లో మేకర్స్ సక్సెస్ అయినప్పటికీ, మేకింగ్ విషయంలో మాత్రం మెప్పించలేకపోయారు. అయితే, కథ పరంగా కొత్త కథనే తీసుకున్నారు అనిల్. కాగానే, కొన్నిచోట్ల థ్రిల్ మిస్ అయ్యేలా చేశారు. ఎందుకంటే, ఇలాంటి సినిమాల్లో ముఖ్యంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటే ఆడియాన్స్ తప్పకుండా చూస్తారు. కానీ, ఇందులో థ్రిల్లింగ్ అంశాలు లేవని టాక్ వినిపించింది.
కథేంటంటే:
మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అయిన కార్తీక్, అంజలి ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. వాళ్లిద్దరు డాక్టర్స్‌గా సెటిల్ అవుతారు. అయితే అంజలికి అనారోగ్య సమస్య వల్ల ఆమెను 28 డిగ్రీ టెంపరేచర్‌లోనే చూసుకోవాలి. ఈ క్రమంలో ఆ జంట చేసిన ఎమోషనల్ జర్నీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆసక్తికరంగా సాగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో వారికి ఎదురైన సవాళ్లు ఏంటీ? అంజలిని సేఫ్‍గా చూసుకునేందుకు కార్తీక్ ఏం చేశాడు? జార్జియాకు ట్రీట్‍మెంట్‍కు వెళ్లాక వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారనేది మిగతా కథ.