సైకో కిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేటలో నవీన్ చంద్ర థ్రిల్లర్ ‘లెవన్’

సైకో కిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేటలో నవీన్ చంద్ర థ్రిల్లర్ ‘లెవన్’

నవీన్ చంద్ర హీరోగా నటించిన  ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘లెవన్’.  లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వంలో  అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించారు.   మే 16న తెలుగు, తమిళ భాషల్లో ఈ  చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రుచిర  ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ బ్యానర్‌‌‌‌పై ఎన్ సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో  రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, శ్రుతిహాసన్ పాడిన పాటకు మంచి రెస్పాన్స్ దక్కింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ను కమల్ హాసన్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసి టీమ్‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.

 ఓ పెద్ద ఫైర్  యాక్సిడెంట్‌‌తో  మొదలైన ట్రైలర్  థ్రిల్లింగ్ ఎక్స్‌‌పీరియన్స్ ఇచ్చింది. ‘లాస్ట్ ఇయర్ వైజాగ్‌‌లో వరుసగా ఎనిమిది హత్యలు జరిగాయి. సీరియల్ కిల్లింగ్స్’  అనే ఇంటెన్స్ డైలాగ్‌‌తో పవర్‌‌‌‌పుల్ పోలీస్ ఆఫీసర్‌‌‌‌గా నవీన్ చంద్ర కనిపించాడు.  ఒకే పద్దతిలో హత్యలు చేసే సైకో కిల్లర్‌‌‌‌ను పట్టుకోవడానికి తను ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది ఇంటరెస్టింగ్‌‌గా చూపించబోతున్నారు.  రేయా హరి,  అభిరామి, రవివర్మ, కిరీటి దామరాజు కీలక పాత్రల్లో కనిపించారు. డి ఇమ్మాన్ అందించిన సంగీతం క్యూరియాసిటీని క్రియేట్  చేసింది.