
నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘లెవెన్’. అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మిస్తున్నారు. మే 16న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఎన్ సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సినిమాపై ఇంటెన్సిటీని క్రియేట్ చేస్తోంది. రేయా హరి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అభిరామి, రవివర్మ, కిరీటి దామరాజు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, శ్రుతిహాసన్ పాడిన పాటకు మంచి రెస్పాన్స్ దక్కింది. డి ఇమ్మాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.