Blind Spot Trailer: మర్డర్ మిస్టరీతో నవీన్ చంద్ర క్రైమ్ థ్రిల్లర్.. ఆసక్తి రేపుతోన్న ట్రైలర్‌

Blind Spot Trailer: మర్డర్ మిస్టరీతో నవీన్ చంద్ర క్రైమ్ థ్రిల్లర్.. ఆసక్తి రేపుతోన్న ట్రైలర్‌

నవీన్ చంద్ర హీరోగా రాకేష్ వర్మ దర్శకత్వంలో రామ కృష్ణ వీరపనేని నిర్మించిన క్రైమ్ థ్రిల్లర్ ‘బ్లైండ్‌‌ స్పాట్‌‌’.శుక్రవారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు.  ఓ యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఫోన్ కాల్ రావడంతో పోలీసులు వస్తారు. వచ్చీరాగానే ఆమెది సూసైడ్ కాదు మర్డర్ అని తేల్చేస్తాడు పోలీస్ ఆఫీసర్.

ఆ తర్వాత ఆ ఇంట్లోని వాళ్లందరినీ అనుమానిస్తూ.. రకరకాల ప్రశ్నలు అడిగి విచారిస్తుంటాడు. ఇంతకూ పోలీస్ విచారణలో తేలిందేమిటి అనే ఆసక్తి రేపుతూ కట్ చేసిన ట్రైలర్‌‌‌‌ ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్‌‌మీట్‌‌లో  హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ ‘రాకేష్ చెప్పిన కథ చాలా గమ్మత్తుగా ఉంది. అది విన్నప్పుడే సీట్ ఎడ్జ్​కు కూర్చున్న ఫీలింగ్ కలిగింది. డిఫరెంట్‌‌ స్క్రీన్‌‌ప్లేతో సాగే థ్రిల్లర్. నాకెంతో కొత్త ఎక్స్‌‌పీరియన్స్‌‌ను ఇచ్చింది’అని చెప్పాడు.

హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ ‘నా ఫేవరేట్‌‌ జానర్‌‌‌‌లో వస్తున్న సినిమా ఇది. సినిమా అంతా నా పాత్ర ఏడుస్తూనే ఉంటుంది. ఫస్ట్ డే నుంచే కష్టమైన సీన్స్‌‌ తీశారు. సినిమా అందరికీ నచ్చుతుంది’ అని చెప్పింది. దర్శకుడు రాకేష్ మాట్లాడుతూ ‘సినిమా అంతా ఒక రాత్రిలో జరుగుతుంది. ఆ కంటిన్యుటీనీ అర్థం చేసుకుని ఆర్టిస్టులంతా ఇన్వాల్వ్​మెంట్‌‌తో వర్క్ చేశారు’అని చెప్పాడు. నటీనటులు గాయత్రి భార్గవి, రవి వర్మ పాల్గొన్నారు.