35 నిమిషాల నా పాత్ర అందర్నీ ఆలోచింపజేస్తుంది

35 నిమిషాల నా పాత్ర అందర్నీ ఆలోచింపజేస్తుంది

రానా, సాయి పల్లవి జంటగా వేణు ఊడుగుల రూపొందించిన ‘విరాట పర్వం’. జూన్ 17న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కీలక పాత్రలో నటించిన నవీన్ చంద్ర ఇలా ముచ్చటించాడు.

‘‘నక్సల్ బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగే బ్యూటిఫుల్ లవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టోరీ ‘విరాటపర్వం’. కథను తలకిందులు చేసే సీనియర్ మోస్ట్ ఉద్యమకారుడు రఘు పాత్రలో కనిపిస్తాను. అతను ఎలాంటి ఎమోషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కీ లొంగిపోడు. ఈర్ష్యతో రగిలిపోతుంటాడు. రవన్నగా రానా,  భారతక్కగా  ప్రియమణి కనిపిస్తారు. నేను, ప్రియమణి ఇద్దరం రానాకి క్లోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటాం. ఉద్యమాలే మాకు ఇంపార్టెంట్. ఇక వెన్నెల అనే పాత్రలో సాయిపల్లవి నటించింది. ఈ పాత్ర కోసం ఆమె చాలా కష్టపడింది. రానా, సాయిపల్లవిల మధ్య ఎలా ప్రేమ పుట్టిందనేది మెయిన్ పాయింట్. వికారాబాద్ ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు నాలుగైదు అడవుల్లో షూట్ చేశాం. ఫారిన్ ఫైట్ మాస్టర్ స్టీఫెన్ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్సులు హైలైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. వేణు ఊడుగుల రైటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందరికీ నచ్చుతుంది. వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధారంగా ఈ  సినిమా తీశారు. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయి. ఇందులో నేను భాగం కావడం హ్యాపీ. ముప్ఫై ఐదు నిమిషాల నా పాత్ర అందర్నీ ఆలోచింపజేస్తుంది. లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డౌన్ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓటీటీ ఆఫర్స్ బాగా వచ్చాయి. లక్కీగా వర్కవుటయ్యాయి కూడా. హీరోగా, విలన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకుంటున్నాను. నేను లీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన ‘అమ్ము’ సినిమా, ‘పరంపర’ సీక్వెల్, యూవీ కాన్సెప్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక మూవీ, తమిళ, తెలుగు బైలింగ్వల్ ఒకటి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రామ్ చరణ్, శంకర్ సినిమా.. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని మూవీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ నటిస్తున్నాను. షూటింగ్ జరుగుతోంది. ఇంపార్టెన్స్ ఉన్న పాత్రల్లో మాత్రమే నటించాలనుకుంటున్నాను. అదృష్టంకొద్దీ అలాంటివే వస్తున్నాయి కూడా. నన్ను నమ్ముతున్న దర్శకులందరికీ థ్యాంక్స్. నేను కూడా సినిమా సినిమాకీ వేరియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండేలా చూసుకుంటున్నాను. అందుకే మరిన్ని చాలెంజింగ్ రోల్స్ వస్తున్నాయి.