నవీన్‌ హత్య కేసు : ప్రియురాలు నిహారిక అరెస్ట్‌

అబ్దుల్లాపూర్మెట్  నవీన్ హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.  హరిహర ప్రియురాలు నిహారిక రెడ్డి, అతని స్నేహితుడు హసన్ ను పోలీసులు  నిందితులుగా చేర్చారు. వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అమ్మాయి కోసమే నవీన్ ను హత్య చేసినట్లుగా హరిహర  కస్టడీలో చెప్పడంతో నిహారికపై పోలీసులు కేసు నమోదు చేశారు. నవీన్ హత్య తర్వాత నిహారిక హరిహరకృష్ణకు రూ.1500 ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. నవీన్ కేసులో నిందితుడు హరిహరకృష్ణకు సహకరించడమే కాకుండా హత్య విషయం తెలిసినా దాచి పెట్టినందుకు పోలీసులు ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు.  ఈ కేసులో  A 1 నిందితుడిగా హరిహర కృష్ణ, A 2 నిందితుడిగా హసన్. A3 నిందితుడిగా నిహరిక పేర్లను చేర్చారు.  హారిక, హసన్ కి వైద్య పరీక్షలు పూర్తి  అయ్యాయి.  మరికొద్ది సేపటిలో వారిని హయత్ నగర్ కోర్ట్ కు తరలించునున్నారు.