స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఒక రోజు తరువాత ఐఏఎస్ ఆఫీసర్ వీకే పాండియన్ కు ఒడిశా ప్రభుత్వం కేబినేట్ ర్యాంకు హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయన్ను ఒడిశా ప్రభుత్వంలో 5T (ట్రాన్స్‌ఫార్మేషనల్ ఇనిషియేటివ్స్) నబిన్ ఒడిశా ఛైర్మన్‌గా నియమించారు. ఈ మేరకు ఒడిశా జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ డిపార్ట్‌మెంట్ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇన్ని రోజులు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రయివేటు సెక్రటరీగా కొనసాగిన పాండియన్ స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు . ఆయన వాలంటరీ రిటైర్‌మెంట్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తమిళనాడుకు చెందిన ఒడిశాకు కేడర్‌కు చెందిన 2000 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. పాండియన్ 2002లో కలహండిలోని ధర్మగర్ సబ్-కలెక్టర్‌గా తన వృత్తిని ప్రారంభించారు.
2005లో మయూర్‌భంజ్ కలెక్టర్‌గా నియమితుడయ్యారు. ఆ తరువాత 2007లో గంజాం కలెక్టర్‌గా పనిచేశారు. గంజాంలో పోస్టింగ్‌లో ఉన్న సమయంలోనే ఆయన సీఎం నవీన్ పట్నాయక్ కు నమ్మకమైన అధికారి అయ్యారు. పాండియన్ 2011లో ముఖ్యమంత్రి కార్యాలయంలో చేరారు.. ఈ తర్వాత ఆయన పట్నాయక్ ప్రైవేట్ సెక్రటరీగా పదోన్నతి పొందారు.