కేంద్రంతో ప్రభుత్వంతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని తాము కోరుకుంటున్నామని, రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం చాలా ముఖ్యమని చెప్పారు. రాష్ట్ర సాహిత్య ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. కేంద్రం విదేశాంగ విధానం, అవినీతి నిర్మూలనకు మోదీ చేపట్టిన కార్యక్రమాలు బాగున్నాయని కొనియాడారు. మోదీ ప్రభుత్వానికి 8/10 రేటింగ్ ఇస్తానన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై పట్నాయక్ మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు తమ పార్టీ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందన్నారు, తన తండ్రి బిజూ పట్నాయక్.. స్థానిక ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించారని.. తాను దానిని 50 శాతానికి పెంచానన్నారు . 2019 ఎన్నికల్లో ఒడిశాలోని 33 శాతం లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ మహిళా అభ్యర్థులను నిలబెట్టిందని పట్నాయక్ చెప్పారు. ఇక ఒక దేశం, ఒకే ఎన్నికలుకు తమ పార్టీ మద్దతు ఇస్తు్ందని, అంతేకాకుండా తాము సిద్దంగా ఉన్నామని చెప్పారు.