
- రాజ్ భవన్లో గవర్నర్‌కు అందజేత
భువనేశ్వర్: బిజు జనతాదళ్(బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ ఒడిశా సీఎం పదవికి రాజీనామా చేశారు. బుధవారం గవర్నర్ రఘుబర్ దాస్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. రాజ్ భవన్‌కు ఒంటరిగానే వచ్చారు. ఈ సందర్భంగా అక్కడున్న జర్నలిస్టులకు అభివాదం చేశారు. వారితో మాట్లాడకుండానే రాజ్‌భవన్ ప్రాంగణం నుంచి వెళ్లిపోయారు.
ఒడిశా సీఎంగా నవీన్ పట్నాయక్ తొలిసారి 2000 మార్చి 5న ప్రమాణస్వీకారం చేశారు. దాదాపుగా 24 ఏండ్ల పాటు పాలనను కొనసాగించారు. కాగా, ఒడిశాలోని 147 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 78 నియోజకవర్గాల్లో గెలుపొంది అధికారాన్ని కైవసం చేసుకుంది.